జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

0

తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేరు పార్టీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… కొందరిని పార్టీలో చేర్చుకునేందుకు సొంత పార్టీ నేతలు ఒప్పుకోలేదు.. అయితే తెలుగుదేశం నేతలని చేర్చుకోవద్దు అని వారు వాదించారు.

ఈ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి జగన్ ని ఉద్దేశించి గతంలో వైయస్ ఫ్యామిలీని తిట్టిన వారిని జగన్ పార్టీలో చేర్చుకున్నారు.. అలాగే మంత్రి పదవులు ఇచ్చారు. రాజకీయాల్లో ఇలాంటి వివాదాలు ఉండవు అని తెలిపారు,

గతంలోజగన్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారని… ఆయన సోదరుడు, దివంగత ఆనం వివేకానందరెడ్డి ఏకంగా జగన్ ను ఉరి తీయాలని అన్నారని చెప్పారు. మరి వారికి టికెట్ కూడా ఇచ్చారు
అలాగే విజయమ్మను తిట్టిన బొత్సకు మంత్రి పదవి ఇచ్చారని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.

విడవలూరు మండలంలోని టీడీపీ నేతలు వంశీరెడ్డి, భాస్కర్ రెడ్డిలను వైసీపీలోకి చేర్చుకోవాలని అనుకున్న సమయంలో సొంత పార్టీ నేతలని బుజ్జగించేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ను ఉదాహరణగా చెప్పడం ఏమిటి అని సొంత పార్టీలో కొందను నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.