చంద్రబాబుపై మరోసారి నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై మరోసారి నాని సంచలన వ్యాఖ్యలు

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను అబద్దాలతో ఆకాశాన్ని ఎక్కించారని అన్నారు…

వారు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు నాని… వారికి నిజం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు… గ్రాఫిక్స్ భవనాలతో చంద్రబాబు నాలుగు నిమిషాల పాటు వీడియో వేసి అంతా నిజమే అనేలా రైతులను భ్రమింప జేశారని అన్నారు…

తమ పార్టీ రైతుల పక్షాన పార్టీ అని అని నాని తెలిపారు.. చంద్రబాబు నాయుడు లాగా రైతులను మోసం చేయమని అన్నారు ఉన్న సంగతులే చెబుతామని నాని స్పష్టం చేశారు…. లక్షకోట్లు ఖర్చు చేశామన్న చంద్రబాబు లక్ష కోట్లు అప్పు మిగిల్చి పోయారని ఆరోపించారు….