నాని ఎమోషనల్ ట్వీట్

నాని ఎమోషనల్ ట్వీట్

0

నాని టాలీవుడ్‌కి ’అష్టా చెమ్మా’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. 2008 సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేశాడు.

’నా మొదటి సినిమా ’అష్టా చెమ్మా’ విడుదలై ఈ గురువారానికి 11 సంవత్సరాలు పూర్తయింది. ’నా’ నుంచి ’మీ’ అయ్యి పదకొండేళ్లు అయింది. ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతుంది. మీ అందరితో నా అనుబంధం మరింత కాలం పాటు కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ నాని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

నాని కొత్త సినిమా ’గ్యాంగ్ లీడర్’ ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు నాని. ఈసినిమాకి విక్రమ్ కుమార దర్శకత్వం వహిస్తున్నాడు.