జగన్ పై లోకేశ్ ఫైర్

జగన్ పై లోకేశ్ ఫైర్

0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ కోలు ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని మరోసారి నిరూపించుకున్నారని మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు… రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధరని రెండింతలు పెంచి ప్రజల నెత్తి పై గుదిబండ వేసారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోతుందని లోకేశ్ మండిపడ్డారు.

ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్ల అవుతుంటే, ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైసీపీ నాయకులు విదేశాలు వెళ్లి వస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు…

ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడిన జగన్ మోహన్ రెడ్డి, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రాష్ట్రం నుండి బయటకు పంపాలని కక్ష కట్టారని లోకేశ్ మండిపోయారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు.