నారాలోకేష్ కి పోటీ వస్తున్న పార్టీలో మరో నేత

నారాలోకేష్ కి పోటీ వస్తున్న పార్టీలో మరో నేత

0

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారాలోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి అని కొత్త వాదనలు వివిపిస్తున్నాయి.. అయితే అధినేత చంద్రబాబు ఆలోచన , లేదా పార్టీలో సీనియర్ల ఏకాభిప్రాయంగా చెప్పారా అనేది పార్టీ ఇంటర్నల్ విషయం.

అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలా మంది పార్టీని వీడుతున్నారు. ఈ సమయలో బాబు కూడా ఈ వలసలు ఆపలేకపోతున్నారు.. అయితే వైసీపీ నిత్యం విమర్శలతో ఫుట్ బాల్ ఆడుకునే లోకేష్ కు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే కష్టం అని బాబుకి సీనియర్లు చెబుతున్నారట.

అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కొందరు మరో సలహ ఇస్తున్నారట.. పార్టీలో యువనాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలి అని కోరుతున్నారట.. పైగా బీసీలకు పెద్ద పీట వేసినట్లు ఉంటుంది అని చెబుతున్నారు, అయితే
చంద్రబాబు దీనికి ఒకే చెబుతారా అనేది చూడాలి, మరికొందరు మాత్రం లోకష్ కు ఇవ్వాలని కోరుతున్నారట, అయితే కొంత కాలం వేచి చూసి తర్వాత నారాలోకేష్ కు పార్టీ బాధ్యతలు ఇవ్వాలి అని చెబుతున్నారట. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సలహ ఇస్తున్నారు, ఎవరు ఎన్నిచెప్పినా బాబు నిర్ణయం ఫైనల్.. చంద్రబాబు దీనిపై జనవరి తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారట.