చినబాబుకు ప్రాణహాని

చినబాబుకు ప్రాణహాని

0

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కు ప్రాణహాని ఉందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది టీడీపీ నాయకుల్లో… వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ నేతకు, అయన కుమారుడుకు ప్రాణహాని ఉందని తమ్ముళ్లు తరుచు మీడియా ముందు చెబుతూనే ఉన్నారు..

అయితే ఇదే క్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివ రావు లోకేష్ కు ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు…. ఈ మేరకు అయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు…. ప్రస్తుతం మంగళగిరి సోషల్ మీడియాలో లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని అయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు…

లోకేష్ పప్పు, మొద్దబ్బారు, దొంగ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని అయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళ గిరి వైసీపీ నాయకుల వల్ల లోకేష్ కు ప్రాణ హాని ఉందని అయన అన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అయన పేర్కొన్నారు