మన రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయి: నారా లోకేశ్

మన రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయి: నారా లోకేశ్

0

విత్తనాల కొరతతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… ఇక్కడి విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఆరోపించారు. ఈరోజు శాసనమండలిలో బడ్జెట్ పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు విత్తనాలు అందించి ఆదుకోవాలని కోరారు. గత టీడీపీ పాలనలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. రూ. 934 కోట్లు సున్నా వడ్డీ రుణాలను ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణమని చెప్పడం దారుణమని అన్నారు.