నయనతార పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో చెబుతున్న జ్యోతిష్యులు

నయనతార పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో చెబుతున్న జ్యోతిష్యులు

0

నయనతార సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన తార అనే చెప్పాలి. ఇప్పటికీ తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో.. టాప్ హీరోయిన్గా నయనతార.. కొనసాగుతోంది.2004లో చంద్రముఖి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ లో, తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి… అగ్రనటులు అందరితో ఆమె నటించింది. దాదాపు 15 సంవత్సరాలుగా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఆమె పెళ్లి గురించి కూడా అన్ని వార్తలు ఈ 10 ఏళ్లుగా వినిపించాయి.

మొదట శింబు, తర్వాత ప్రభుదేవ, ఇప్పుడు విఘ్నేష్.. ఇదీ నయనతార మీడియాకు పరిచయం చేసిన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్. అయితే వచ్చే వారం పెళ్లి అనేంతగా నయన పెళ్లి గురించి వార్తలు వచ్చేవి.. కాని ఒక్కసారిగా వాటికి బ్రేక్ పడేది. మరి మూడో బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ తో ఆమె పెళ్లి జరుగుతుందా అని అందరూ ఆలోచిస్తున్నారు.

అయితే.. నయనతార జాతకం ప్రకారం.. ఆమెకు పెళ్లి అస్సలు అచ్చు రాదని.. వివాహం జరిగేటట్టుగా కనిపించడం లేదని.. కొందరు జోత్యిష్యులు అంటున్నారు. ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటే.. జయలలిత మాదిరి.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు వాళ్లు చెబుతున్నారు. అందుకే.. విఘ్నేష్తో పెళ్లికి ఆమె వెనకడుగేస్తోందట. అయితే ఇలాంటి వార్తలు నమ్మద్దు అంటున్నారు అభిమానులు.. అంతేకాదు వచ్చే ఏడాది వీరికి పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి ..విఘ్నేష్ ఆమెని పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారట. మరి చూడాలి నయన పెళ్లి ఎప్పుడో.