నయనతార మాములుగా పెంచలేదుగా..!!

నయనతార మాములుగా పెంచలేదుగా..!!

0

తెలుగు తమిళ భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా వన్నెతగ్గని హీరోయిన్ అంటే నయనతార.. ఆమెకు స్టార్ హీరోకి కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమెకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ తెలుసుకోవచ్చు.. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతోను .. మరో వైపున స్టార్ డమ్ వున్న యువ కథానాయకులతోను .. ఇంకో వైపున వర్ధమాన కథానాయకులతోను సినిమాలు చేయడం .. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మెప్పించడం నయనతార ప్రత్యేకత.

తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా సినిమా లో నటిస్తుంది.. ఇక తమిళంలో రజనీ సరసన ‘దర్బార్’ .. విజయ్ జోడీగా ‘బిజిల్’ చేస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాను కూడా చేస్తోంది. అయితే ఇన్ని సినిమాలతో బిజీ గా ఉన్న నయన్ ఏకంగా నాలుగు కోట్ల పారితోషకంగా తీసుకుందట.. దీంతో సౌత్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె మారిపోయింది.. ఈ నేపథ్యంలో నయనతార తన పారితోషికాన్ని మరో 2 కోట్లకి పెంచేసిందని చెప్పుకుంటున్నారు. ఆమెతో సినిమా చేయాలంటే 6 కోట్లు సమర్పించుకోవలసిందేనన్నమాట. ఇప్పుడు ఈ విషయమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.