నేడే నీలంసాహ్ని సీఎస్ గా బాధ్యతలు కీలక నిర్ణయం

నేడే నీలంసాహ్ని సీఎస్ గా బాధ్యతలు కీలక నిర్ణయం

0

ఏపీ ప్రభుత్వం పథకాలతో సంక్షేమ పాలనతో ముందుకు సాగుతోంది. అయితే పరిపాలనలో కూడా జగన్ తన మార్క్ చూపిస్తున్నారు. తన మాట వినే అధికారులని అలాగే వర్క్ డెడికేషన్ ఉన్న అధికారులని డిప్యుటేషన్ పై అవసరం అయితే కేంద్రం నుంచి తీసుకువస్తున్నారు. అయితే ఇటీవల ఏపీలో సీఎస్ ని బదిలీ చేయడం తెలిసిందే.

తాజాగా ఆయన బదిలీ తర్వాత నీలంసాహ్నికి సీఎస్ పదవి ఇస్తారు అని అందరూ భావించారు .. ఆమె కూడా హస్తిన నుంచి వచ్చి జగన్ ను కలిశారు. అయితే తాజాగా అదే జరిగింది… ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా నీలంసాహ్ని నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని ఇటీవల సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. వెను వెంటనే ఏపీ సర్కారు కూడా ఆమెని బాధ్యతలు తీసుకోమని తెలియచేసింది.

నూతన సీఎస్‌గా నీలం సాహ్ని నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఇఫ్పటికే మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ సర్కారుకి, ఏపీకి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు, గతంలో ఏపీలో ఆమె పలు పోస్టుల్లో వర్క్ చేశారు.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా , నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పని చేశారు. ఆమెకు ఏపీ తెలంగాణపై పూర్తి అవగాహన ఉంది.