నీకు పార్టీలోకి ఎంట్రీలేదు తేల్చి చెప్పిన జగన్

నీకు పార్టీలోకి ఎంట్రీలేదు తేల్చి చెప్పిన జగన్

0

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయా అంటే అది ఒక్క అద్దంకిలో మాత్రమే… దశాబ్దాల కాలం నాటినుంచి గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం ఉంది…

అయితే 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు… ఆ సమయంలో కరణం బలరాం రవి కుమార్ పార్టీలో చేరికను వ్యతిరేకించినప్పటికీ ఆయన్న టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు…..

ఇక 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం బలరాంను పోటీ చేయించి రవిని వేరేస్థానంలో పోటీ చేయించారు చంద్రబాబుబు… అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో గొట్టిపాటి రవికుమార్ తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట.. తనకు సన్నిహితంగా ఉన్న వైసీపీ నేతల ద్వారా జగన్ కు సంకేతాలు కూడా పంపుతున్నారట…. అయితే ఆయన పార్టీలోకి రాకను జగన్ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి..