నేరుగా చంద్రబాబు ఫోన్ రంగంలోకి మాజీ మంత్రి

నేరుగా చంద్రబాబు ఫోన్ రంగంలోకి మాజీ మంత్రి

0

ఏపీలో తెలుగుదేశం పార్టీకి దారుణమైన పరాభవం వచ్చింది ఈ ఎన్నికల్లో…. దీంతో పార్టీలో కొందరు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు, అయితే పార్టీలో నేతలు ఇలా పార్టీ మారేందుకు సిద్దం అవ్వడం జిల్లా నేతల నుంచి సమాచారం రావడంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్ ని అలాగే జిల్లా నేతలని అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మారాలనుకునే నేతలకు కాల్ చేస్తున్నారు.

పార్టీ మారద్దు అని చెబుతున్నారు.. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నేతలతో బాబు మంతనాలు జరిపారు అని తెలుస్తోంది.. సీనియర్ నేతలని వైసీపీలో చేర్చుకునేందుకు పక్కా ప్లాన్ రచిస్తున్నారు.. ఈ విషయంలో బాబు ముందుగానే అలర్ట్ అయ్యారు అని తెలుస్తోంది.. ముఖ్యంగా మాజీ మంత్రిని రంగంలోకి దించారు చంద్రబాబు. ఎలాంటి సమయంలోని అయినా పార్టీ వీడద్దు అని చెబుతున్నారట.

పార్టీ తరపున జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నా తాను చూసుకుంటాను అని చెబుతున్నారట.. అయితే నేరుగా రంగంలోకి చంద్రబాబు రావడంతో ఇక టీడీపీ నుంచి వలసలు ఉండవు అని కొందరు మాట్లాడుతున్నారు.. వైసీపీ కావాలనే ఇలా చేస్తోందని టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అని భావిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు.