న్యూ లుక్ లో రాహుల్ గాంధీ పోలా అదిరిపోలా…

న్యూ లుక్ లో రాహుల్ గాంధీ పోలా అదిరిపోలా...

0

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దికాలంగా అస్సలు కనిపించకున్నారు… దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తర్వాత ట్విట్టర్ వేదికగా చేసుకుని విమర్శలు చేస్తున్నారే తప్ప ఇప్పటివరకు బయటకు రాలేదు… అయితే తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించారు…

కరోనా కట్టడి విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు… కరోనా మహమ్మారిని అరికట్డానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని అన్నారు… ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన రాహుల్ చూసి అందరు షాక్ కు గురి అయ్యారు…

జుట్టుకు రంగు వైసి హెయిర్ స్టైల్ ను పూర్తిగా మర్చేశారు.. ఠక్కున చూస్తే మళ్లీ మనముందు రాజీవ్ గాంధీ వచ్చాడా అన్నంతలా కనిపించారు… ఏది ఏమైనా రాహుల్ గాంధీ న్యూ లుక్ అదిరిపోయిందని అంటున్నారు…