ఈ నెల 27న నూతన సచివాలయానికి భూమిపూజ!

ఈ నెల 27న నూతన సచివాలయానికి భూమిపూజ!

0

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సచివాలయం భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత సచివాలయంలోని డీ బ్లాక్‌ వెనకవైపు ఉన్న ఉద్యానవనంలో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. సుమారు 4 లక్షల చదరపు అడుగులలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఇందుకోసం ప్రస్తుత స్థలం చుట్టూ ఉన్న మరికొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. కొత్త సచివాలయం నలువైపులా రోడ్డు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. స్థలాన్ని మొత్తాన్ని చతురస్రాకారంలోకి మార్చి వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రభుత్వం భావన.