బుల్లితెరపై చరణ్, తారక్, రాజమౌళి హల్‌చల్.. కానీ ఇంతలోనే ఓ ట్వీస్టు

బుల్లితెరపై చరణ్, తారక్, రాజమౌళి హల్‌చల్.. కానీ ఇంతలోనే ఓ ట్వీస్టు

0

’ఢీ’. ఈ షో బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఇప్పటికి పది సీజన్లు పూర్తి చేసుకుని, పదకొండో సీజన్ పూర్తి చేయడానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. ’ఢీ’ ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ షో పదకొండో సీజన్ ఫైనల్స్‌కు చేరుకుంది. దాదాపు ఏడాది పాటు సాగిన ఈ షోలో నాలుగు జట్లు చివరి అంకానికి చేరుకున్నాయి. అందులో సుధీర్ టీమ్ నుంచి రెండు జట్లు, రష్మీ జట్టు నుంచి రెండు టీమ్స్ ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో రెండు మాత్రమే లెవెల్ – 2కు చేరుకుని టైటిల్ కోసం పోరాటం చేస్తాయి. ఫైనల్లో గెలిచే జోడీ 75 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటు టైటిల్ గెలుచుకుంటుంది.

సూపర్ క్వాలిఫైయర్స్ అయిపోయిన తర్వాత నాలుగు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అదే సమయంలో వచ్చే వారం జరిగే ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను షో నిర్వహకులు విడుదల చేశారు. అందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా యూనిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి వస్తారంటూ ప్రకటించారు. దీంతో సదరు హీరోల అభిమానులు సంతోషించారు. కానీ ప్రస్తుతం ఈ యూనిట్ బల్గేరియాలో ఉంది.

అక్కడ ఎన్‌టీఆర్ షెడ్యూల్ ఒకటి షూట్ చేస్తారని, ఆయనపై మాత్రమే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతాయుని టాక్. దీంతో సదరు చానెల్ గతంలో విడుదల చేసిన ప్రోమోలను తీసేసింది. వాటి బదులు మరికొన్ని ప్రోమోలను విడుదల చేసింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టీం వస్తే టీఆర్పీ రికార్డులు బద్దలవుతాయని చాలా మంది అనుకున్నారు. గతంలో ఎన్టీఆర్ వచ్చిన ఎపిసోడ్ భారీ స్థాయిలో రేటింగ్ సంపాదించుకుంది. దీంతో మరోసారి అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయనుకున్నారు. కానీ వారి ఆశలు అన్ని నిరాశలుగా మిగిలాయి.