బిగ్ బాస్ ప్రేక్షకులు కు ఇస్మార్ట్ బ్యూటీ ట్రీట్…

బిగ్ బాస్ ప్రేక్షకులు కు ఇస్మార్ట్ బ్యూటీ ట్రీట్...

0

బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్…. తెలుగులో ప్రసారమయ్యే సీజన్ 3కి అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు…. బిగ్ బాస్ సీజన్ 1 ను ఎన్టీఆర్ మాస్ గా కొనసాగిస్తే సీజన్ 2కి నాచురల్ స్టార్ నానీ నాచురల్ గా రానించగా ఇప్పుడు కింగ్ కాస్త మాస్ అండ్ క్లాస్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సీజన్ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది… ఈ సారి విన్న ప్రకటించడానికి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి… ఇంకా ఈ విషయమై క్లారిటీ రాకుండా మరో విషయం సినీ వర్గాల్లో అలాగే బుల్లితెర వర్గాల్లో తెగరచ్చ జరుగుతుంది…

అదేంటంటే హీరోయిన్ నిధి అగర్వాల్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతున్నారట… బిగ్ బాస్ స్టేజ్ పై ఇస్మార్ట్ బ్యూటీ ఎందుకని అనుకుంటున్నారా… బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో ఐదు నుంచి 10 నిమిషాలు డాన్స్ ఫెర్ఫామెన్స్ చేయబోతున్నారట నిధి…