నిఖిల్ ‘శ్వాస’ గురించి ఫిల్మ్ నగర్ టాక్

నిఖిల్ 'శ్వాస' గురించి ఫిల్మ్ నగర్ టాక్

0

నిఖిల్ కథానాయకుడిగా రూపొందిన ‘అర్జున్ సురవరం’ క్రితం నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే ఏదో ఒక కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వెళుతోంది. ఆ సినిమా సంగతి అటుంచితే నిఖిల్ మరో చిత్రంగా చాలాకాలం క్రితమే ‘శ్వాస’ సెట్స్ పైకి వెళ్లింది. నివేదా థామస్ కథానాయికగా కిషన్ కట్టా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

‘శ్వాస’ టైటిల్ బాగుందని అంతా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ‘అర్జున్ సురవరం’ ఇంతవరకూ థియేటర్లకు రాకపోవడం అభిమానులను నిరాశకి గురిచేస్తుండగా, ‘శ్వాస’ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్త వాళ్లు మరింత డీలాపడేలా చేస్తోంది. ఈ ప్రచారంపై నిఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.