‘విరాట పర్వం’ మూవీని చూసిన Dj టిల్లు..ఏమని రివ్యూ ఇచ్చాడంటే?

0

రానా ద‌గ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.

తాజాగా విరాట‌ప‌ర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మనముందుకొస్తున్నాడు. విరాట‌ప‌ర్వం గ‌తేడాది ప్ర‌థ‌మార్థంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కరోనా మహమ్మారి కారంణంగా అన్ని సినిమాలలాగే ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో మనకు కనబడనుండగా..సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో  ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ స్క్రీనింగ్ చూసి ట్విట్టర్ వేదికగా సినిమా రివ్యూ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాపై డీజే టిల్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇది ఒక చక్కని కళాఖండం అని పేర్కొన్నాడు. ఈ రానా, సాయి పల్లవి కొత్త లుక్ లో బాగున్నారని ట్వీట్ చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here