నిర్భయ తల్లిదగ్గరకు హంతకుడు ముఖేశ్ సింగ్ తల్లి వెళ్లి ఏమందో చూడండి

నిర్భయ తల్లిదగ్గరకు హంతకుడు ముఖేశ్ సింగ్ తల్లి వెళ్లి ఏమందో చూడండి

0

నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష ఖరారు చేసింది కోర్టు, జనవరి 22న వారిని ఉరి తీయనున్నారు.న్యాయస్థానం ఆదేశాలతో ఇక ఉరికంబం ఎక్కనున్నారు వారు. అయితే ఈ విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. విచారణ కొనసాగుతున్న సమయంలో దోషి ముఖేశ్ సింగ్ తల్లి నేరుగా నిర్భయ తల్లి దగ్గరకు వెళ్లింది.

అయితే ఇలాంటికేసుల సమయంలో ఇరువురి వాదనలు కోర్టు వింటుంది నిర్బయ తల్లిమాత్రం ఆనలుగురు దోషులకి శిక్ష విధించాల్సిందే అని కోరారు, అయితే ఆ నిందితుల పేరెంట్స్ కూడా కోర్టు తీర్పు ఎలాంటిది వస్తుందో చూశారు, ఈ సమయంలో కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో

నా కొడుకు జీవితం మీ చేతుల్లో ఉంది… క్షమాభిక్ష పెట్టండి అంటూ నిర్భయ తల్లిని వేడుకుంది ముఖేశ్ సింగ్ తల్లి . దాంతో నిర్భయ తల్లి ఘాటుగా స్పందించారు ససేమిరా ఒప్పుకోము అన్నారు. తనకూ ఓ బిడ్డ ఉండేదని, ఆమె పట్ల జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఎలా క్షమాభిక్ష పెట్టాలి? అని ప్రశ్నించారు. నా బిడ్డకు న్యాయం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నాంఅంటూ వ్యాఖ్యానిస్తుండగా జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు, దీంతో అందరూ సైలెంట్ అయ్యారట. ఈ తీర్పు అమలు జరగాలి నాకుమార్తెకు న్యాయం జరగాలి అని నిర్భయ తల్లి కన్నీరు పెట్టుకుంది.