ఉత్త‌రకొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విష‌మం – సీరియ‌స్

ఉత్త‌రకొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విష‌మం - సీరియ‌స్

0

ఉత్త‌రకొరియాలో ఇప్పుడు పెద్ద చ‌ర్చ, ప్ర‌పంచం అంతా ఆ దేశం వైపు చూస్తోంది, అవును ఉత్త‌ర‌కొరియా నియంత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్య తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ఇప్ప‌టికే ఆయ‌న ఆరోగ్యం గురించి ప్ర‌పంచ మీడియా ప‌లుక‌ధ‌నాలు విడుద‌ల చేస్తోంది.

ఆయ‌న‌కు క‌రోనా సోకింది అని అందుకే ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి, కాని అక్క‌డ ప్ర‌భుత్వం మాత్రం అస‌లు మా దేశంలో క‌రోనా లేద‌ని అంటోంది, ఆయ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌తో చికిత్స జ‌రుగుతోంది అని కొంద‌రు అంటున్నారు.

కాని కొరియ‌న్ స‌ర్కార్ మీడియాకు ఏ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా చూస్తోంది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాని విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చసాగింది. చాలా రోజులుగా ఆయ‌న బాహ్య ప్ర‌పంచానికి క‌నిపించ‌డం లేదు, దీంతో తీవ్ర చర్చ దేశంలో జ‌రుగుతోంది.