ఐటీ జాబ్ కాదని – గాడిద పాల వ్యాపారం..శ్రీనివాస గౌడ సక్సెస్ స్టోరీ ఇదే..!

Not an IT job - donkey milk business..this is the success story of Srinivasa Gowda ..!

0

భారీ వేతనంతో కూడిన ఐటీ ఉద్యోగం. మంచి లగ్జరీ లైఫ్. ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి అలా అనుకోలేదు. ఐటీ కంపెనీలో ఉద్యోగం కంటే గాడిదల్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు. దీనితో భారీ వేతనంతో కూడిన ఐటీ ఉద్యోగాన్ని 2020లో వదిలిపెట్టాడు. సక్సెస్ బాట పట్టాడు. గాడిద పాల వ్యాపారంతో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. తాజాగా ఇతని సక్సెస్ స్టోరీ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

2020 వరకు ఐటీ ఉద్యోగం చేసిన శ్రీనివాస గౌడ కరోనా, లాక్ డౌన్ లతో దానికి స్వస్తి చెప్పాడు. రూ.42 లక్షల పెట్టుబడితో 20 గాడిదలను సమకూర్చుకున్నాడు. దేశంలో ఇదొక ప్రత్యేకమైన, కర్ణాటకలోనే మొదటి గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి కేంద్రంగా అతడు పేర్కొన్నాడు.

‘‘గాడిద పాలను విక్రయించాలన్నది మా ప్రణాళిక. గాడిద పాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నది మా స్వప్నం. గాడిద పాలు ఔషధ గుణాలతో కూడినవి. దీన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలో గాడిద సంతతి తగ్గిపోతుండడంతో నాకు ఈ ఆలోచన వచ్చింది. 30 ఎంఎల్ పాల ధర రూ.150’’ అని శ్రీనివాసగౌడ వివరించాడు. మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్లలో ఆవు, గేదె పాల మాదిరే గాడిద పాలను విక్రయానికి ఉంచనున్నట్టు ఆయన తెలిపాడు. ఇప్పటికే తనకు రూ.17 లక్షల విలువ ఆర్డర్లు వచ్చినట్టు వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here