ఆగ‌ని చైనా క్రూరత్వం -కరోనా సమయంలో డాగ్ మీట్ ఫెస్టివల్ – ఎంత దారుణం

Not Stopped Chinese Cruelty - Dog Meat Festival during Corona

0

మాంసాహారం తిన‌డంలో చైనాని మించిన వారు లేరు. ఏకంగా అన్నీ ర‌కాల జంతువుల‌ని లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. ఇక్క‌డ క‌రోనా వైర‌స్ విజృంభించిన త‌ర్వాత చాలా వ‌రకూ జంతువుల మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. కాని క‌రోనా టీకా వేసిన త‌ర్వాత కాస్త కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాక మ‌ళ్లీ జంతువుల‌ని తిన‌డం స్టార్ట్ చేశారు.

ఇక ప్ర‌పంచంలో చాలా దేశాల్లో ఇలా జంతువుల‌ని తిన‌డం మానుకుంటున్నారు. కానీ చైనా మాత్రం త‌న ఫుడ్ పెస్టివ‌ల్స్ ఆప‌డం లేదు.చైనా డాగ్ మీట్ ఫెస్టివల్ జరుపుకుంటోంది. మొత్తం ఐదు వేల కుక్కలను చంపి 10 రోజులు తింటారు.ఇది యులిన్ డాగ్ మీట్ ఫెస్టివల్. దీని గురించి ప్ర‌పంచం అంతా తిట్టిపోస్తున్నా చైనా మాత్రం అవేమీ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇలా చేయ‌డం అనారోగ్యం అని వైద్యులు నిపుణులు చెబుతున్నా పెద్ద సంఖ్యలో కుక్కలను యులిన్ నగరానికి రవాణా చేస్తున్నారు. గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని యులిన్ నగరం నుంచి చంపిన‌ కుక్కల ఫోటోలు బ‌య‌ట‌కువ‌చ్చాయి.

మే చివరి నాటికి డోంగ్కౌ మార్కెట్లో ఎనిమిది, మాన్కియావో మార్కెట్లో 18 స్టాండ్లను కనుగొన్నారు.
పండుగ పేరిట ప్రజలు కుక్క మాంసం తినడానికి కొనడానికి మార్కెట్లు, రెస్టారెంట్లకు పెద్ద ఎత్తున వ‌స్తున్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అనారోగ్యాలు వ‌స్తాయి అని చెప్పినా అక్క‌డ విన‌డం లేదు.
కోవిడ్ -19 గబ్బిలాల నుంచి మానవులకు వచ్చిందని నమ్ముతారు. ఇలా ఈ కుక్క‌లు అనేక ర‌కాల జంతువులు తిన‌డం వ‌ల్ల మ‌రిన్ని కొత్త జ‌బ్బులు వ‌స్తాయ‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here