ఎన్టీఆర్ ఫోటో స్టోరీ

ఎన్టీఆర్ ఫోటో స్టోరీ

0

ఎన్టీఆర్.. రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీ కోసం ఇద్దరు విపరీతంగా కష్టపడుతున్నారు. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా రాజమౌళికి పేరుంది. సినిమా పర్ఫెక్ట్ గా తీసేందుకు ఎంత కష్టమైన పడతాడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో ఉన్నాడు. వచ్చిన తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుంది. అడవిలో పుట్టిపెరిగిన ఆదివాసీ కొమరం భీం స్వాతంత్ర సమయంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. బలిష్టమైన దేహం ఆయన సొంతం. ఆ దేహం కోసం ఎన్టీఆర్ జిమ్ లో రోజుల తరబడి కసరత్తులు చేస్తున్నారు. అమెరికాకు చెందిన ట్రైనర్ సమక్షంలో ఎన్టీఆర్ ట్రైన్ అవుతున్నాడు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో ట్రైనర్ లీయోన్డ్ స్టీవెన్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తొడలవరకు మాత్రమే కనిపిస్తున్న ఫోటో అది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నది. రెండు వేలమందికి పైగా ఈ ఫోటోను లైక్ చేశారు.