ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఆ బ్యూటీనేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఆ బ్యూటీనేనా ?

0

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ నటిస్తున్నారు, చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రీలీజ్ అవుతుంది, అయితే ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు, ఇప్పటికే ప్రకటన కూడా చేశారు..ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తోన్న ఈ సినిమాకు సంబందించి త్రివిక్రమ్ స్టోరీపై ఫోకస్ చేస్తున్నారు.

తాజాగా ఈసినిమాలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది ప్రధమార్ధంలో స్టార్ట్ అవుతుంది, ఈ సినిమాకి అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు పరిశీలన చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పలువురి పేర్లు వినిపించాయి. ముఖ్యంగా పూజా హెగ్డే, సమంత జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి, అయితే తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఆమె అయితే తారక్ పక్కన బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి ఆమె ఏం చెబుతుందో చూడాలి, ఆమె ప్రస్తుతం చాలా బిజీగా ఉంది, ఓ పక్క నితిన్ తో రంగ్ దే చేస్తోంది, ఇక సర్కారువారి పాటలో ఆమె నటిస్తోంది, వేదాళం రీమేక్ లో చిరు చెల్లెలి పాత్రలో కనిపిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here