జగన్ ని ఓ కోరిక కోరిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

జగన్ ని ఓ కోరిక కోరిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

0

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష చట్టం తీసుకురావడంతో ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ ని అభినందించారు. జగన్ తీసుకుంది మంచి నిర్ణయం ఆయన పార్టీ తరపున నేతలకు, అలాగే ఆయనకు, సభలో బిల్లుకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు, అయితే తాజాగా
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై జగన్ ను కేజ్రీవాల్ అభినందించారు. ఇలాంటి చట్టాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. దిశ చట్టం బిల్లు ప్రతిని తనకు పంపించాలని కోరారు.

దీంతో ఏపీ లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం బాగుందని అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు జగన్ ని అభినందిస్తున్నాయి, ఇలాంటి నీచులకి దుర్మార్గులకి కఠినంగా శిక్ష పడాలి అని కోరుతున్నారు. ఏపీ దిశ యాక్ట్ ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపై 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన ఆధారాలు ఉంటే… 21 రోజుల్లో శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. దీనినే జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అయితే ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపట్ల సానుభూతి చూపించకూడదు అంటున్నారు. వీరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులుఏర్పాటు చేసి 21 రోజుల్లో ఉరిశిక్ష అమలు చేయాలని అప్పుడే వీరిలో మార్పు వస్తుంది అంటున్నారు. అదే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది..అలాగే ఇటీవల సోషల్ మీడియా .. ఫోన్లలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు వస్తున్నాయి. దీనికి జగన్ కట్టడి వేశారు, ఇలా మాట్టాడినా పోస్టులు పెట్టినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు.