సచివాలయం పేరు మార్చిన ఒడిశా ముఖ్యమంత్రి

సచివాలయం పేరు మార్చిన ఒడిశా ముఖ్యమంత్రి

0

ఒడిశా సచివాలయం పేరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మార్చారు. ఇప్పటి వరకు ‘సచివాలయ’గా పిలుచుకున్న ఈ పేరును ‘లోక్ సేవా భవన్’గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి పని చేయాల్సి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని… వారికి సేవ చేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయానికి పేరు మార్చినట్టు తెలిపారు. ఒడిశా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.