ఒక్క ఛాన్స్ మాత్రమే జనసేన ఎమ్మెల్యేకు పవన్

ఒక్క ఛాన్స్ మాత్రమే జనసేన ఎమ్మెల్యేకు పవన్

0

మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ ఓ దారిలో వెళితే, ఆయన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక డిఫరెంట్ గా వెళుతున్నారు.. పవన్ కు ఆయన పార్టీకి కాస్త భిన్నంగా ఆయన వెళుతున్నారు అనే చెప్పాలి.. ఇటీవల పలు సంఘటనలు చూస్తుంటే అవును అనిపిస్తుంది.. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సభల్లో సమావేశాల్లో వైసీపీ అధినేత టార్గెట్ గా విరుచుకుపడుతుంటారు. ఇక చంద్రబాబు వెనుక ఉండి పవన్ ని నడిపిస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.. అయితే రాపాక మాత్రం జగన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.

మరో పక్క దీనిపై సీరియస్ వార్నింగ్ ఇద్దాము అంటే పార్టీకి ఉన్న కేరాఫ్ అడ్రస్ ఆయన మాత్రమే, అందుకే పవన్ కూడా వెనక అడుగు వేస్తున్నారు..
ఈ మధ్యే ఇంగ్లీష్ మీడియం చదువులను పవన్ వ్యతిరేకిస్తే అసెంబ్లీ సాక్షిగా జనసేన ఎమ్మెల్యే ఇంగ్లీష్ మీడియంకు మద్దతు తెలిపారు, జగన్ పాలన బాగుంది అని పలు సార్లు కితాబులు ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరీ గ్రామంలో చేనేత వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే రాపాక.. జగన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫొటోకు పాలతో అభిషేకం చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇలా పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీ అధినేతని పొగడ్తలతో ముంచడం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం ఇంకోసారి చేస్తే కచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇస్తారు అని తెలుస్తోంది.. కేవలం ఒక్కసారి మాత్రమే చూడనున్నారట. మరో సారి ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే కచ్చితంగా జనసేన ఎమ్మెల్యేపై పవన్ చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు.