ఈ ఒక్క విషయంలో జగన్ బ్యాక్ స్టెప్

ఈ ఒక్క విషయంలో జగన్ బ్యాక్ స్టెప్

0

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సరికొత్త విప్లవం తీసుకువస్తున్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్నీ వాగ్దానాలు నెరవేరుస్తున్నారు.. అయితే ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు అంటున్నారు.. అదే కొత్త జిల్లాల ఏర్పాటు. అయితే జగన్ సర్కారు వచ్చిన వెంటనే వీటిని ఏర్పాటు చేస్తారు అని అందరూ అనుకున్నారు.. కాని ఆ ప్రక్రియ మరింత జాప్యం జరిగింది.

తాజాగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత కొత్త జిల్లాల విభజన ఏర్పాటు ఉంటుంది అని తెలుస్తోంది, ఇక కొత్త మండలాలు మండలాల హెడ్ క్వార్టర్లు గ్రామాల విలీనం ఇలా చాలా ఉన్నాయి. అలాగే అక్కడ నేతలు ప్రజలు కూడా ఒప్పుకోవాలి. దీనికి కమిటీ వేయాలి. దానిపై కమిటీ రెండు నెలలలో రిపోర్టు ఇస్తుంది. ఇలా చూసుకున్నా ఖచ్చితంగా ఫ్రిబ్రవరి వరకూ ఆ ప్రాసెస్ ముందుకు కదలదు అంటున్నారు అధికారులు.

అందుకే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించాలని జగన్ అనుకుంటున్నారట.. ముందు జనవరిలో అనుకున్నారు, కాని ఈనెలలో అమ్మఒడి ప్రారంభిస్తున్న సందర్బంగా ఈ ప్రక్రియని మరో రెండు నెలలు హోల్డ్ లో పెడుతున్నారట