ఆన్ లైన్ బాట పట్టిన మరో డైరెక్టర్…

ఆన్ లైన్ బాట పట్టిన మరో డైరెక్టర్...

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో డైరెక్టర్ ఆన్ లైన్ బాట పట్టాడు… దర్శకుడు తేజ ఆన్ లైన్ లో కోర్సు నేర్చుకుంటున్నాడట.. ఒక ఇంగ్లీష్ డైలీతో దర్శకుడు తేజా మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు… ఆన్ లైన్ లో డబ్ల్యూహెచ్ ఓ నేర్పించే వైరస్ కు సంబంధించిన క్లాస్ లను చెబుతున్నారు..

ఆ క్లాస్ లను తేజా వింటున్నాడట… ఈ వయసులో దర్శకుడు తేజా చూపిస్తున్న ఆసక్తిని నిజంగా అభినందించాల్సిందే… ఆయన ప్రస్తుతం కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన విషయాలపై అద్యాయనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు…

పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అసలు వైరస్ ఎక్కడ పుట్టింది… ఈ వైరస్ వ్యాప్తికి కారణంఏంటీ ఎన్నిరకాల వైరస్ లు ఉన్నాయనే విషయమై ఆయన ఆన్ లైన్ ద్వారా నేర్చకుంటున్నాడట…. కాగా గోపిచంద్ తో ఒక సినిమా అలాగే రానాతో ఒక సినిమాను తేజా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..