ఒట్టుతీసి గట్టుమీదపెట్టేసిన పవన్ కళ్యాణ్

ఒట్టుతీసి గట్టుమీదపెట్టేసిన పవన్ కళ్యాణ్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవలమీద కాలు మోపి పయణిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే మరో వైపు ట్విట్టర్ ద్వారా పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు… లాక్ డౌన్ తో వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడటంలో ఆయన ఇప్పుడు రాజకీయాలమీద దృష్టిపెట్టారు…

ఇటీవలే ఆయన ఒక మాట చెప్పారు… ఇప్పుడు కరోనా వైరస్ ఉందని ఇటువంటి వేళ ఎవరూ రాజకీయాలు చేయకూడదని అందరి దృష్టి కూడా కరోనా కట్టడి మీదనే ఉండాలని అన్నారు… రాజకీయాల్లో జూనియర్ అయిన పవన్ మంచి మాట చెప్పడం భేష్ అని అన్నారు కొందరు… అయితే ఇటీవలే పవన్ ఒట్టు తీసి గట్టుమీద పెట్టారని అంటున్నారు…

పవన్ ట్విట్టర్ ద్వారా చేసింది ఇంతవరకూ వలస కార్మికుల కష్టాల గురించి తెలియచేయడం వారిని ఆదుకోవాలని పాలకులను కోరడం అయితే ఇదే సమయంలో టీడీపీ, బీజేసీ. సీపీఐ వంటి పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నాయి… చంద్రబాబు నాయుడు అయితే ప్రతీ రోజు సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు… దానికి కన్నా , సీపీఐ రామకృష్ణ వంటి వారు జతకలుస్తున్నారు.. మరి ఇది బురద జల్లుడూ రాజకీయం కాదా పవన్ కళ్యాణ్ అని రాజకీయ తటస్తులు ప్రశ్నిస్తున్నారు…