పడుకుంటే 1 లక్ష రూపాయలు వింత టాస్క్

పడుకుంటే 1 లక్ష రూపాయలు వింత టాస్క్

0

మన దేశంలో కొన్ని కంపెనీల ఆలోచన చాలా వింతగా ఉంటుంది. కస్టమర్లను పెంచుకునేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తాయి, వాటిలో విన్ అయిన వారి నుంచి మౌత్ పబ్లిసిటీ కూడా వస్తుంది, ముఖ్యంగా ఇటివల కొన్ని కంపెనీలు పెట్టే చాలెంజ్ టాస్క్ లు జనాలని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో కొత్త టాస్క్ వచ్చింది. నిద్రపోతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అవును రోజులాగే నిద్రిస్తూ రూ. లక్ష గెలుపొందవచ్చు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ రోజూలాగే నిద్రపోయేవారికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

వేక్ ఫిట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వేక్ ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్… పేరుతో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. 100 రోజులు, ప్రతి రోజూ రాత్రి 9గంటలు వారు ఇచ్చే పరుపుపై పడుకోవాలి. ఉదయం వరకూ మీరు కచ్చితంగా దానిపైనే పడుకోవాలి, అవును తాజాగా ఈ ఆఫర్ మన దేశంలో ఇస్తోంది ఈ కంపెనీ.మీ ఇంట్లో ప్రతిరోజూ రాత్రి 9 గంటలపాటు నిద్రపోవాలి. ఇలా 100 రోజులు నిద్రించాలి. ప్లేస్ మారడానికి కుదరదు, పడుకునే సమయంలో మెబైల్ ల్యాప్ టాప్ ఉపయోగించకూడదు.

ఇక మీరు పడుకునే సమయంలో డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు పడుకునే సమయంలో పైజామా ధరించాలట.పడుకునే ముందు స్లీప్ ట్రాకర్ ఉపయోగించి వారి స్లీపింగ్ టెస్ట్ పెడతారు. సో మరి పూర్తి వివరాలు మీరు వెబ్ సైట్లో చూడచ్చు.. దాదాపు లక్ష మందీ దీనికి అప్లై చేసుకున్నారట.100 రోజులు ఇలా డైలీ పడుకుంటే మీకు లక్ష రూపాయలు ఇస్తాము అని చెబుతోంది కంపెనీ.