వైసిపి సోషల్ మీడియాపై ఫిర్యాదు చేయాలనీ పవన్ నిర్ణయం

వైసిపి సోషల్ మీడియాపై ఫిర్యాదు చేయాలనీ పవన్ నిర్ణయం

0

ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్.. రెండు చోట్ల పోటీ చేసి, ఓడిపోయినా విషయం అందరికి తెలిసిందే. ఐతే పార్టీలో ఓడిపోయినా పవన్ ఇప్పటికి సహనం, నమ్మకం కోల్పోలేదు. తనదైన శైలిలో ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. పార్టీ నాయకులకు ధైర్యం చెబుతూ వారి వెంటే ఉంటున్నారు.

ఎప్పటికప్పుడు పార్టీని ఎలా బలపర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడు పవన్ ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. అటు తన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే పవన్ ఈ మధ్య ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. వైసిపి సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లీగల్ నోటీసులు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.

జనసేన పార్టీపై వైసిపి సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. పార్టీపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని తమ పార్టీ వర్గాలకు పవన్ స్పష్టం చేశారు.