పర్చూరు రాజకీయానికి ఎండ్ కార్డ్ వేసిన జగన్

పర్చూరు రాజకీయానికి ఎండ్ కార్డ్ వేసిన జగన్

0

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ అంశం చిచ్చు రేపింది అంటే దాని గురించి నాలుగు రోజులు వార్త వచ్చి. తర్వాత అది చల్లారుతుంది. అది జగన్మోహన్ రెడ్డి అలా కూల్ చేస్తారో, లేదా నాయకుల మధ్య ఒప్పందాలు జరుగుతాయో కాని వివాదాలు వెంటనే పరిష్కారం అవుతాయి. అయితే తాజాగా పర్చూరు రాజకీయం ఏపీలో వారం రోజులు రోజూ చర్చలు డిబేట్లు నడిచేలా చేసింది.

తెలుగుదేశం పార్టీ కూడా దీనిని నిశితంగా గమనించింది. వైసీపీలో దగ్గుబాటి కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వడం లేదని, ఎన్నికల ముందు అవసరం కోసం వైసీపీలో చేర్చుకున్న దగ్గుబాటిని, ఇప్పుడు గెలిచిన తర్వాత జగన్ పట్టించుకోవడం లేదు అనేలా విమర్శలు వచ్చాయి. రామనాథం బాబుకు జగన్ అక్కడ బాధ్యతలు ఇవ్వడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఆయన కుమారుడికి అక్కడ విలువ ఇవ్వకుండా చేశారు అని అన్నారు.. అయితే ఇప్పుడు ఆ వివాదం చల్లారిపోయింది. జగన్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు అని తెలుస్తోంది.. జగన్ కూడా దీనిపై నేరుగా దగ్గుబాటితో చర్చించారట, అందుకే దగ్గుబాటి కూడా పార్టీని వీడకుండా కామ్ గా వైసీపీలో కొనసాగుతున్నారని చర్చ జరుగుతోంది.