పారితోషికం భారీగా అందుకుంటున్న టాప్ హీరోయిన్

పారితోషికం భారీగా అందుకుంటున్న టాప్ హీరోయిన్

0

ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఉత్సాహంతో ఉంది అందాల భామ నభా నటేష్, ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి, ఆమె అందానికి కుర్రకారు ఫిదా.. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఆమెతో సినిమాకి డేట్స్ తీసుకుంటున్నారు..
తెలుగులో తన తొలి సినిమా నన్నుదోచుకుందువటే తోనే నటన విషయంలో ఆకట్టుకున్న ఈ హీరోయిన్ కు, ఆ తర్వాత విజయం కూడా దక్కింది.

తాజాగా ఆమె రవితేజ సినిమా డిస్కోరాజాలో ఒక హీరోయిన్ గా నటించింది . ఇక విడుదలకు ఈ చిత్రం రెడీ అవుతోంది.
ఈమె కెరీర్ కన్నడ సినిమాలతో ప్రారంభం అయ్యింది. కాని అక్కడ పెద్ద సినిమాల్లోనే నటించినా చాలా తక్కువ రెమ్యునరేషన్ వస్తుంది.. ఎంతైనా అక్కడ రెమ్యూనరేషన్ తక్కువే అని చాలా మంది అంటారు. కాని ఇప్పుడు తెలుగులో మాత్రం ఆమెకు భారీగా రెమ్యునరేషన్ వస్తోందట.

మూడు తెలుగు సినిమాల ఎక్స్ పీరియన్స్ తో ఈమె 80 లక్షల క్లబ్ లో చేరుతోందని వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా నభా నటేష్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించబోయే సినిమాలో ఫిక్స్ అయింది. అందులో కూడా ఆమెకు భారీగా పారితోషికం ఇవ్వనున్నారట.