పారితోషికంలో రజనీని దాటేస్తున్న విజయ్ దేవరకొండ

పారితోషికంలో రజనీని దాటేస్తున్న విజయ్ దేవరకొండ

0

చాలా తక్కువ సమయంలో హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో అంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి.. తనకు వచ్చిన మంచి సినిమా అవకాశాలను చేస్తూ సక్సెస్ అయ్యారు విజయ్. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ లైఫ్ మార్చేసింది అని చెప్పాలి, మన దేశంలో అర్జున్ రెడ్డి సినిమాతో అందరికి బాగా పరిచయం అయ్యాడు విజయ్.

తాజాగా ఆయనకు బిగ్ ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది…ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ తో ఒక సినిమా కోసం చర్చలు జరుపుతుందని సమాచారం.ఈ సినిమాకి విజయ్ దేవరకొండకి యష్ రాజ్ ఫిలిమ్స్ రూ. 48 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే విజయ్ సినిమాలు చూసినా అంత పెద్ద డీల్ అంటే, కచ్చితంగా సౌత్ ఇండియాలో టాప్ హీరోల్లో రజనీ తర్వాత తనే ఉంటాడు, మరి ఈ వార్త వినిపిస్తోంది కాని ఇది నిజమా కాదా అనేది తెలియాలి.

ప్రస్తుతం రజనీ కాంత్ మాత్రమే ప్రస్తుతం రూ.50 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు సౌత్ ఇండియాలో
. ఇక బీ-టౌన్ స్టార్స్ గా చెలామణి అవుతున్న ఖాన్ లు, కపూర్ లు, సింగ్ లు ఎవ్వరూ కూడా ఈ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. మరి విజయ్ కు ఇంత ఆఫర్ చేసింది అంటే కచ్చితంగా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో చిత్రం రిలీజ్ చేస్తూ ఉండాలి.