పార్టీ మారడంపై యార్లగడ్డ క్లారిటీ

పార్టీ మారడంపై యార్లగడ్డ క్లారిటీ

0

ప్రస్తుతం గన్నవరం రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే…ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు… దీంతో యార్లగడ్డ అనుచరులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు…

మరి కొందరు ఒంకొ అడుగు ముందుకేసి ఆయన పార్టీ మారుతారని ఇంతవరకు చర్చించుకున్నారు… అయితే ఇదే క్రమంలో యార్లగడ్డ తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు… ఈ సందర్భంగా మీడియా ప్రశ్నిస్తూ వంశీ వైసీపీలోకి వస్తే యార్లగడ్డ పార్టీ మారే అవకాశం ఉందా అని ప్రశ్నించింది….

దీనికి ఆయన సమాధానం ఇస్తూ తనకంటూ ఓ క్యారెక్టర్ ఉందని తాను పార్టీ మారే వ్యక్తిని కాదని అన్నారు… పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా కలిసి పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు… ఇంతవరకు వంశీ వైసీపీపీలోకి వస్తానని తాను మీడియాలో చూడటమే తప్ప తనకు తెలియదని అన్నారు