పవన్ చెప్పింది వింటే కచ్చితంగా శభాష్ అంటారు

పవన్ చెప్పింది వింటే కచ్చితంగా శభాష్ అంటారు

0

పవన్ కల్యాణ్ ఇటీవల దిష ఘటనపై నిందితుల విషయంలో చేసిన కామెంట్లు పెను వైరల్ అయ్యాయి.. రెండు బెత్తం దెబ్బలు వెయ్యాలి అని ఆయన చేసిన కామెంట్లపై చాలా మంది విమర్శలు చేశారు..
తాజాగా పవన్ కల్యాణ్ ఇలా మహిళలపై దాడులు చేసే వారిని వదిలిపెట్టకూడదని కామెంట్ చేశారు.

అత్యాచారాలకు సింగపూర్, దుబాయ్ తరహాలో బహిరంగ శిక్షలు విధించాలని, ఆ శిక్షలను చట్టబద్ధం చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.. బహిరంగ శిక్షలు అమలుచేస్తే చాలా మందిలో మార్పు వస్తుంది అని అన్నారు ఆయన. దిశ వంటి సంఘటనలు జరగకూడదంటే ఇలా చేయాలంటూ పవన్ తరపున జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

తప్పు చేసినవాడ్ని చంపేయడం, నరికేయడం అటవిక న్యాయం అవుతుందని, దానికి బదులు సింగపూర్, దుబాయ్ దేశాల్లో మాదిరి కఠినమైన బహిరంగ శిక్షల్ని చట్టబద్ధం చేయాలనేది తన వాదన అని పవన్ స్పష్టం చేశారు. ప్రజలకు తెలియని దిశలు, నిర్భయలు ఎంతోమంది ఉన్నారని, కదిరి వంటి ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నా ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరని వ్యాఖ్యానించారు. అందుకే కఠినమైన శిక్షల్ని చట్టబద్ధం చేసి, బహిరంగంగా అమలు చేస్తే సమాజంపై ఆ ప్రభావం తెలుస్తుందని అన్నారు పవన్ కల్యాణ్