పవన్ సినిమాపై ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాపై ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

0

టాలీవుడ్ లో ఈ మధ్య పింక్ సినిమా గురించి బీభత్సంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాని పవన్ కల్యాణ్ చేస్తున్నారు అని ఇప్పటికే చర్చలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి.. అంతేకాదు దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యారు అని వార్తలు వినిపించాయి.. హిందీలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక కోలీవుడ్ లో కూడా అజిత్ చేశారు అక్కడ సక్సస్ అయింది.

అందుకే తెలుగులో దీనిని చేయాలి అని చూస్తున్నారు. దీని తెలుగు రీమేక్ హక్కులు నిర్మాత దిల్ రాజు దగ్గర ఉన్నాయి .అయితే పవన్ ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనే అనుకున్నారు. కాని మరో పక్క ఇంట్రస్టింగ్ వార్త వచ్చింది.

సంక్రాంతికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా దిల్ రాజు ఏర్పాట్లు చేస్తుండటంతో, పవన్ ఈ సినిమా చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో మళ్లీ ఊపందుకుంది. అయితే ఈ సినిమాపై ప్రకటన మాత్రం జనవరిలో చేస్తారట అప్పటి వరకూ నో టాపిక్ అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.