పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టిన ముగ్గురు హీరోయిన్లు వీరే

పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టిన ముగ్గురు హీరోయిన్లు వీరే

0

పవన్ కల్యాణ్ హిందీ సినిమా పింక్ తెలుగులో చేస్తున్నారు అని అనేక వార్తలు ఈ మధ్య వినిపించాయి.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ హిట్ మూవీ పింక్ పవన్ చేస్తున్నారు అని చాలా మంది అన్నారు. టాలీవుడ్ లో కూడా ఇంకా వార్త బయటకు రావడం లేదు కాని పవన్ దీనికి ఎస్ చెప్పారు అంటున్నారు.

పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కూడా చేసినట్లు సమాచారం. 2020 జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి పింక్ సినిమా వెళ్లనుంది. ఐతే ఈ మూవీ ప్రధాన కథ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. హీరోకి మించిన స్క్రీన్ ప్రజెన్స్ వారికి ఉంటుంది. మరి ఈ ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం ఎవరిని తీసుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అక్కడ హిందీలో హిట్ కాంబినేషన్ కు ఇక్కడ అదే రిపీట్ చేస్తారా అనే అనుకుంటున్నారు అందరూ.

ఒరిజినల్ హిందీ చిత్రం పింక్ లో ముగ్గురు అమ్మాయిలలో ప్రధాన పాత్రకు తాప్సిని తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం అంజలి, నివేదా థామస్ ల అలాగే తాప్సీని తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. మరి చివరి వరకూ వీరేనా లేదా వేరే వారికి అవకాశం వస్తుందా అనేది చూడాలి.