పవన్ ఎఫెక్ట్ టీడీపీ ఎమ్మెల్యేకు లైన్ క్లియర్…

పవన్ ఎఫెక్ట్ టీడీపీ ఎమ్మెల్యేకు లైన్ క్లియర్...

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు లైన్ క్లియన్ అయిందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… కొద్దికాలంగా గంటా బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

ఈ వార్తలపై ఆయన చాలా సార్లు స్పందించారు… తాను పార్టీ మారనని స్పష్టం చేసినా కూడా గంటా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి…. అయితే ఏపీ బీజేపీలో సరైన బలం లేదనే కారణంగా వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది…

అయితే తాజాగా పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో సాద్యమైనంత త్వరగా బీజేపీలో చేరాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి……

కాగా విశాఖలో గంటా బలమైన రాజకీయ వేత్త ఆయన పోటీ చేసిన ప్రతీ సారి గెలుస్తూనే ఉన్నారు… ఈ ఎన్నికల్లో భీమిలీలో కాకుండా చంద్రబాబు నాయుడు వేరే చోట పోటీ చేయించినా కూడా తన సత్తాచాటారు గంటా…