పవన్ ఎందుకు సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తున్నారో వైసీపీ క్లారిటీ

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాట తీస్తానన్న పవన్ ఆయన తాటను ప్రజలు ఈ ఎన్నికల్లో తీసేశారని అన్నారు…

ఆయన తాట తీస్తామంటే తాము తీయించుకోవడానికి సిద్దంగాలేమని అంబటి అన్నారు… పవన్ లాంగ్ మార్చ్ లో టీడీపీ స్క్రిప్ట్ చదివి అబాసుపాలు అయ్యాని అన్నారు… అలాగే పవన్ రీ ఎంట్రీపై కూడా ఆయన స్పందించారు… పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారంటే జగన్ పరిపాలన బాగుందని అర్థమని అన్నారు రాంబాబు…

జగన్ పరిపాలన బాగుంది కాబట్టే పవన్ మళ్లీ సినిమాలు చేసుకోవడానికి సిద్దమయ్యారని అన్నారు… జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా పవన్ అలాగే చంద్రబాబు నాయుడులను మెప్పించలేమని రాంబాబు అన్నారు…