వైసీపీ కంచుకోటలో వపన్ కీలక డెషిషన్

వైసీపీ కంచుకోటలో వపన్ కీలక డెషిషన్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు… అధికూడా వైసీపీ కంచుకోటలో…. 2024 ఎన్నికలలోపు పార్టీపై ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు పవన్ మార్పులు చేస్తున్నారు.. తాజాగా నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ స్థానంతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్…

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ గా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ని నియమించారు పవన్. అలాగే సుళ్లూరు పేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉయ్యాల ప్రవీన్. సర్వేపల్లికి సుంకర హేమలత…ఆత్మకూరు నియోజకవర్గానికి మలిశెట్టి శ్రీధర్ ను నియమించారు.

ఇక కావలికి అలహరి సుధాకర్, ఉదయగిరికి వేముల రాజాలను ఇంచార్జ్ లుగా పవన్ నియమించారు.. ఇక నెల్లూరు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలకి ఇంచార్జ్ లను నియమించేంత వరకు మనుక్రాంత్ బాధ్యతలు తీసుకున్నారు…