వర్మ సినిమాలో పవన్ !

వర్మ సినిమాలో పవన్ !

0

వివాద స్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కాంట్రవర్సీతో ముందుకొచ్చాడు. లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాతో తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన వర్మ తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన వర్మ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో ఈయన క్యారెక్టర్ ఎవరిదో గెస్ చేయండి అంటూ పవన్ పోలీకలతో ఉన్న నటుడి ఫోటో ట్విట్ చేసి పెద్ద రచ్చ చేశాడు. అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్‌ను పోలిన మనిషి ఫోటోను ట్వీట్ చేసి పెద్ద వివదానికి తెర లేపాడు. ఈ ఫోటోను ముందుగా చూస్తే అందురు పవన్ కళ్యాణే అనుకుంటారు. కాస్తంత తదేకంగా చూస్తే కాని పవన్ కళ్యాణ్ కాదనే విషయం అర్థవువుతుంది.

ఈ సినిమాను తెలుగు దేశం పార్టీపై సెటైరికల్‌గా వైసీపీకి అనుకూలంగా తెరకెక్కిస్తున్నట్టు టైటిల్ ను బట్టే చెప్పొచ్చు. సరిగ్గా చెప్పాలంటే టైటిల్‌తోనే కావల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున వర్మ పవన్ ఎంట్రీతో మరింత రచ్చ రేపుతున్నారని చెప్పవచ్చు.