చెన్నైలో ఉన్నప్పుడు విజయనిర్మల ఇంటి ఎదురుగానే ఉండేవాళ్లం: పవన్ కల్యాణ్

చెన్నైలో ఉన్నప్పుడు విజయనిర్మల ఇంటి ఎదురుగానే ఉండేవాళ్లం: పవన్ కల్యాణ్

0

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రముఖ నటదర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్ మీడియాతో మాట్లాడుతూ ఆమె కుటుంబంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాము చెన్నైలో విజయనిర్మల ఇంటి ఎదురుగానే ఉండేవాళ్లమని, తమ ఇంటికి నరేశ్, అతని కుమారుడు నవీన్ వస్తుండేవారని పవన్ తెలిపారు. విజయనిర్మల కుటుంబంతో తమకు అప్పటినుంచే స్నేహం ఉందని వివరించారు. ఆమె ఓ నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా ఉన్నతస్థానానికి ఎదిగారని, అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మన మధ్యలేరంటే బాధగా ఉంది అని పేర్కొన్నారు.