పవన్ పద్దత మార్చుకోకుంటే గట్టిదెబ్బే…

పవన్ పద్దత మార్చుకోకుంటే గట్టిదెబ్బే...

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా తన పద్దతిని మార్చుకోకుంటే రాజకీయంగా గట్టి దెబ్బతగిలేలా కనిపిస్తుందని రాజకీయ మేధావులు అంటున్నారు… తన సిద్దాంతాలు, నచ్చకనో విధానాలు నచ్చకనో తెలియదుకానీ చాలామంది జనసేనకు గుడ్ బై చెబుతున్నారు…

ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీలో చేరగా తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కూడా వైసీపీ గూటికి చేరారు… ఇలా ఒక్కొక్కరు జారుకుంటూ పోతే కొత్త నాయకుల సంగతి ఏమో తెలియదు కానీ ఉన్న క్యాడర్ ని కాపాడుకోకుంటే రానున్న రోజుల్లో పార్టీకి భారీ స్థాయిలో నష్టం చేకూరే అవకాశం ఉందని అంటున్నారు…

అందులోను పార్టీకి బలం అంతంగా ఉందని దానినైనా కాపాడుకుంటే రానున్న రోజుల్లో ప్రతిపక్షహోదా అయినా దక్కుతుందని లేదంటే అదికూడా దక్కదని అంటున్నారు… అంతేకాకుండా పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని ఇటీవలే ప్రచారం జరుగుతోంది… ఇదే జరిగితే జనసేన రాజకీయం గందరగోళం మారే అవకాశం ఉందని అంటున్నారు…