పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా సాఫ్ట్ వేర్ ఇంజనీర్

పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా సాఫ్ట్ వేర్ ఇంజనీర్

0

పవన్ కల్యాణ్ రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే..సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అయితే సినిమా గురించి అనౌన్స్ మెంట్ మాత్రమే ఆగింది. ఈ సినిమా ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే సీరియస్ కోర్ట్ డ్రామా. కథలో ఈ ముగ్గురు అమ్మాయిలు కీలకంగా ఉంటారు. కాగా ఆ ముగ్గురు అమ్మాయిలలో ఒక పాత్ర మల్లేశం చిత్రంలో ప్రియదర్మి సరసన హీరోయిన్ గా నటించిన అనన్య దక్కించుకుంది అని తెలుస్తోంది.

అవును పవన్ సరసన ఆమెకు అవకాశం వచ్చింది అని వార్తలు వైరల్ అవుతున్నాయి, అనన్యకు ఆఫర్ వచ్చింది అని టాలీవుడ్ అంతా చర్చించుకుంటున్నారు. ఆమె సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే హీరోయిన్ గా మల్లేశం చిత్రంలో నటించింది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. తాజాగా పవన్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది అనన్య.