పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ కామెంట్ – పవన్ ఫ్యాన్స్ సీరియస్

Pawan kalyan Fans Serious on Kathi Mahesh Comments

0

పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ గత రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ,పవన్ కల్యాణ్ అభిమానులు చర్చించుకుంటున్నారు దీని గురించి. కేంద్ర మంత్రి వ‌ర్గంలో వీరికి ఛాన్స్ ఉంద‌ని ఏపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురుందేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీరి పేర్లతో పాటు తాజాగా పవన్ కల్యాణ్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో జతకట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఇక మరికొన్ని రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ పేరు తెరపైకి రావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి వార్తలు వినిపిస్తున్న వేళ. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏం పీకేడని ఇస్తార్రా కేంద్రమంత్రి పదవి ? మీరు మీ భ్రమలు కాకపోతేను అంటూ కత్తి మహేష్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here