తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పవన్

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పవన్

0

తాను గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటణ కూడా విడుదల చేశారు…రాష్ట్రంలో మీడియాస్వేచ్చ కోసం మీడియా మిత్రులు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేవానికి నేను రాలేకపోతున్నానని తెలిపారు…

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తన వెన్నుపూసలకు తీవ్ర గాయాలు అయ్యాయని ప్రస్తుతం ఆ నొప్పి వీడటంలేదని అన్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను గెలుపే లక్ష్యంగా చేసుకుని తన గాయాన్ని సైతం మర్చి పోయానని అందుకే ఈ గాయం తీవ్రత ఇప్పుడు మరింత పెరిగిందని అన్నారు..

తాను వెంటనే శస్త్రచికిత్సలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారని తెలిపారు.. పార్టీ తరపున జనసైనికులు తరపున జర్నలిస్ట్ లు స్వేచ్చకోసం పూర్తి మద్దతు తెలుపు తున్నానని పవన్ స్పష్టం చేశారు.