బిజీ బిజీగా పవన్ పది రోజులు టైం ఇస్తున్న పవన్

బిజీ బిజీగా పవన్ పది రోజులు టైం ఇస్తున్న పవన్

0

ఏపీలో పవన్ కల్యాణ్ ఇప్పుడు మూడు పనులు చేస్తున్నారు.. ఒకటి రాజకీయం, రెండు రాజధాని విషయంలో పోరాటం, మూడు సినిమాలు, అయితే మూడు రాజధానుల విషయంలో పవన్ పోరాటం తెలిసిందే . ఈ సమయంలో పింక్ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు పవన్ అనేది తెలిసిందే.

సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది, అయితే పవన్ సినిమాలు చేయను అన్నారు కదా మరి ఎందుకు చేస్తున్నారు అనేది వైసీపీ విమర్శ… అయితే జనసేన అధినేత మాత్రం ఈ విమర్శలు పట్టించుకోలేదు. ఇక మూడు రాజధానులు ఎలా వినిపిస్తున్నాయో, పవన్ కూడా తన వర్క్ షెడ్యూల్ మూడు విధాలుగా డిసైడ్ చేశారట.

పది పది రోజుల వంతున మూడు చోట్ల వుండబోతున్నారు అని తెలుస్తోంది. పది రోజులు పింక్ రీమేక్ షూట్ లో వుంటారు. ఆపైన పది రోజులు డైరక్టర్ క్రిష్ చేయబోయే సినిమా షూట్ లో వుంటారు. ఆపైన మరో పది రోజలు రాజకీయాలకు కేటాయిస్తారు అని అంటున్నారు, అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అనేది చూడాలి, సినిమాలకు ఒకే రాజకీయాలకు ఇలా కుదరదు కదా అంటున్నారు మేధావి వర్గం.