ఇంకా హీరోగానే పవన్…!!

ఇంకా హీరోగానే పవన్...!!

0

వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన హీరోలకి అక్కడ అన్ని ప్లేస్ లు తప్ప మైనస్ లు ఉండవు. ఎప్పుడూ పాజిటివ్ లోనే ఉంటారు. తప్ప నెగిటివ్ అసలు పట్టించుకోరు. అయితే రాజకీయం అంటేనే పెద్ద రొచ్చు రాజకీయంలో తరతమ భేదాలు ఉండవు. ఘాటైన సెటైర్లతో ఒకరిపై మరొకరు విరుచుకుపడతారు. అయితే పవన్ సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఆయన ఇంకా ఫంక్ రాజకీయల అవసరం లేకపోతున్నారు. దానికి కారణం ఆయన హీరోని అన్న భావన నుంచి బయటపడలేక పోవడమే అంటున్నారు. సినిమా హీరో గొడుగులు పట్టించుకున్న వాళ్లకి రాజకీయాల్లోనూ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు కావాలి కానీ రాజకీయం చాలా దారుణంగా ఉంటుంది. కాళ్లకు మొక్కి నట్టే మొక్కి కిందకి లాగి పడేస్తారు.

పార్టీ అధినేతగా ఉన్న పవన్ ఇంకా ఇంకా హీరో వైభవాన్ని కోరుకుం టే ఆయన విమర్శలను స్వీకరించక పోవడమే కారణం. తాను ఎవరినైనా అనొచ్చు తనను ఎవరైనా ఏమన్నా అంటే అసలు భరించలేని వైఖరి పవన్ లో ఉందని అంటున్నారు. బొత్స సత్యనారాయణ పవన్ ను టిడిపికి చంద్రబాబుకు బినామీ అన్నారు. అయితే దాన్ని పవన్ జీర్ణించుకోలేక తాను ఎవరికీ బినామీని కాదని అంటూనే వైసిపి ఎవరికి బినామి అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.

కానీ వైసిపి తొమ్మిదేళ్లుగా ఒంటరిగానే రాజకీయం చేసినట్లు అనిపిస్తుంది. జగన్ ఎవరితో పొత్తు పెట్టుకున్న దాఖలాలు కానీ సంఘటనలు కాని లేవు. కానీ జనసేన పార్టీ పెడుతూనే నాలుగేళ్లు మోడీని చంద్రబాబుని మోసింది. నాలుగేళ్ల తర్వాత సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా అవగాహన లేని విధంగానే పవన్ వివరించారు.! నారా లోకేష్ పోటీ చేసే స్థానంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థిని పెట్టలేదు. పవన్ పోటీ చేసే రెండు స్థానాల్లో కి చంద్రబాబు వెళ్లలేదు ఎన్నికల ముందు, తరువాత పవన్ విమర్శలు చేసింది. ఎప్పుడు జగన్ మీదే దాంతో బొత్స అన్న మాటలకు పవన్ కి పొంతన లేదు. రాజకీయం అన్నాక విమర్శలు తప్పవు సర్దుకుని వెళ్లాలి తప్ప నన్ను ఎవరు ఏమి అనకూడదు అంటే కుదరదు కదా..!